.100 కోట్లు.. మంత్రి పదవులు’ జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు భాజపా ప్రలోభాలు : కుమారస్వామి

తమ పార్టీ ఎమ్మెల్యేలను అక్రమ మార్గాల్లో భాజపా వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని జేడీఎస్‌ నేత కుమారస్వామి ఆరోపించారు.

రూ.100 కోట్ల ఆఫర్‌తోపాటు కొంతమంది జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వజూపారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు లేకపోయినా నరేంద్రమోదీ కర్ణాటకలో అధికారం చేపాడతాననడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో మత విద్వేషాలు రెచ్చగొట్టినందువల్లే 104 స్థానాలు గెలుపొందిందని కుమారస్వామి ఆరోపించారు. ఈరోజు బెంగళూరులో జరిగిన జేడీఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో కుమారస్వామిని ఎమ్మెల్యేలందరూ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కుమారస్వామి.. తన సోదరుడు హెచ్‌డీ రేవణ్ణతో కలిసి మాట్లాడారు. తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
కర్ణాటకలో జేడీఎస్‌ను అంతమొందించాలన్నదే భాజపా లక్ష్యమని కుమారస్వామి ఆరోపించారు. రాష్ట్రంలో లౌకికవాదం నెలకొనాలనే కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 104 స్థానాలు గెలుచుకున్న భాజపాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేనందువల్లే తాము కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు. ఈ పొత్తు ఎన్నికల ఫలితాల తర్వాత కుదిరిందే తప్ప.. ఎన్నికల ముందు నిర్ణయించింది కాదని స్పష్టం చేశారు. తనకు అధికార దాహం లేదని.. ముఖ్యమంత్రి కావాలన్న కోరికా లేదని.. కేవలం రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్‌తో పనిచేయాలని అనుకున్నామన్నారు. జేడీఎస్‌లో చీలిక లేదని రేవణ్ణ స్పష్టం చేశారు.

amnnewz Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *