మోడీ పై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ….ప్రధాని కి నా కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదు

’?
మోదీపై విమర్శలు సంధించిన రాహుల్‌గాంధీ

బీదర్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కర్ణాటకలోని బీదర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాఫెల్‌ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ‘యూపీఏ హయాంలో రాఫెల్‌ ఒప్పందం గురించి ఫ్రాన్స్‌తో మాట్లాడాం. మీ టెక్నాలజీ ఉపయోగించుకుని భారత్‌లో యుద్ధవిమానాలు తయారు చేస్తాం. దీని వల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించినట్లువుతుంది. కానీ మోదీ అధికారంలోకి రాగానే.. రాఫెల్‌ ఒప్పందం మొత్తం మార్చేశారు. రాఫెల్‌ కొనుగోలుకు ఎంత ఖర్చయిందనే విషయాలను రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ దాచి పెడుతూ అబద్ధాలు చెబుతున్నారు. అదేమంటే రాఫెల్‌ కొనుగోలుకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచాలని ఫ్రాన్స్‌, భారత్‌ మధ్య ఒప్పందం ఉందని చెబుతున్నారు. కానీ అటువంటి ఒప్పందమేమి లేదని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు స్వయంగా నాతో చెప్పారు. ప్రభుత్వం బయట పెట్టాలనుకుంటే రాఫెల్‌ ధర ఎంతో చెప్పొచ్చు’ అని అన్నారు.

‘రాఫెల్‌ ఒప్పందంపై సంతకం చేసే సమయంలో ప్రధాని మోదీ పక్కన అనిల్‌ అంబానీ ఉన్నారు. యువతకు ఉద్యోగాలు రాకుండా అంబానీ లాక్కున్నారు. రాఫెల్‌ ఒప్పందంపై చర్చకు రావాల్సిందిగా మోదీకి చాలా సార్లు సవాల్‌ విసిరాను. కానీ ఆయన నా సవాల్‌ను ఎప్పటికీ అంగీకరిచరు. ఈ ఒప్పందం విషయంలో ఆయన దేశానికి అబద్ధాలు చెబుతున్నారు. ఆయన ఎందుకు నా ప్రశ్నల నుంచి పారిపోతున్నారు’? అని రాహుల్‌ ప్రశ్నించారు.

‘మోదీ.. మీరు భారతదేశానికి ప్రధాని. అంతేకానీ 10-15 మంది పారిశ్రామికవేత్తలకు కాదు’ అంటూ రాహుల్‌ ఎద్దేవా చేశారు. ‘మోదీ నా కళ్లలోకి సూటిగా చూడలేరు. ఎందుకంటే రాఫెల్‌ ఒప్పందం విషయంలో ఆయన అబద్ధాలు చెబుతున్నారు. అందుకే చూడలేకపోతున్నారు. దాని గురించి కనీసం ఒక్క సెకన్‌ కూడా ఆయన మాట్లాడటం లేదు’ అని రాహుల్‌ మండిపడ్డారు. యూపీ, బిహార్‌ వసతి గృహాల్లో బాలికపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఆయన ప్రస్తావించారు. ‘యూపీ, బిహార్‌ ఘటనపై మోదీ ఒక్క మాట కూడా మాట్లడటం లేదు. ఈ అత్యాచార ఘటనల్లో నిందితులుగా ఉన్న వారిని రక్షించే పనిలో ఆయన బిజీగా ఉన్నారు’ అంటూ రాహుల్‌ దుయ్యబట్టారు.

amnnewz Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *